Saturday, January 24, 2026

Buy now

రాజన్నను దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ఈఓ వినోద్ ప్రసాదం అందజేశారు.

అనంతరం చైర్మన్, సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular