Sunday, January 25, 2026

Buy now

Jeevan reddy: రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతా

  • నాకు ఏ పార్టీ నుంచి ఫోన్లు రాలేదు
  • ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

కనీసం తనకు మాటనైనా చెప్పకుండా ఇలా చేర్చుకోవడంపై అధిష్ఠానంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాల ఊపందుకున్నాయి.

దీంతో సోమవారం మంత్రి శ్రీధర్‌ బాబుతో పాటు ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా తన మనసు మార్చుకోలేదు.

ఈ నేపథ్యంలో కార్యకర్తల అభీష్టం మేరకు రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని జీవన్‌ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం బేగంపేటలోని జీవన్‌ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.

ఆయనకు నచ్చజెప్పేలా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఈ సాయంత్రానికి జీవన్‌రెడ్డి తన నిర్ణయాన్ని ప్రెస్‌మీట్‌ ద్వారా వెల్లడించనున్నట్లు సమాచారం.

Related Articles

spot_img

Most Popular