Friday, January 23, 2026

Buy now

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న, మొన్నటివరకు కాస్త తగ్గినట్లు కనిపించిన బంగారం ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాములు (24 క్యారెట్లు) బంగారంపై రూ.110 పెరగ్గా, 22 క్యారెట్లపై రూ.100 పెరిగింది.

దీంతో బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్లు) రూ.89,400 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.81,950గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇదిలాఉంటే వెండి ధరలు కూడా కిలోకు రూ.వెయ్యి పెరిగి రూ.1,02,000గా కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ,1.11 లక్షలు పలుకుతోంది.

Related Articles

spot_img

Most Popular