Thursday, March 13, 2025

Buy now

Hydra | కోహెడలో హైడ్రా పంజా

కబ్జా భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ గ్రామంలో కబ్జా చేసిన భూమిలో ఓ రియల్టర్‌ నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా ఆదివారం కూల్చివేసింది.

సర్వే నంబర్ 951, 952లోని పంచాయతీ లే అవుట్‌లో త‌మ ప్లాట్ల‌ను స‌మ్మిరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్ర‌మించడంతో పాటు ర‌హ‌దారులు లేకుండా అడ్డుగోడ‌లు క‌ట్టార‌ని రాధే ధామం లే ఔట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ప‌లువురు ప్లాట్ ఓన‌ర్ల హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

కోహెడ గ్రామంలోని సర్వే నెం.951, 952లోని భూమికి సంబ‌ధించిన ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌గా.. 1986లో భూ యజమానులు కే.రాములు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయ‌తీ లేఔట్ వేసిన‌ట్టు నిర్ధారించారు. ఈ భూముల్లో సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి ఫాం హౌస్ నిర్మించ‌డంతో పాటు.. లే ఔట్‌లోని ప‌లు ప్లాట్ల‌ను సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది.

సంబంధిత అన్ని పత్రాలతో హాజరు కావాలని కావాల‌ని ఇరు ప‌క్షాల‌కు హైడ్రా నోటీసులివ్వగా ఈ నెల 8న ఇరు ప‌క్షాలు హాజ‌రయ్యారు. రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారుల స‌మ‌క్షంలో ప‌త్రాల ప‌రిశీలించి ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణానికి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని.. తుర్కయాంజల్ మున్సిపాలిటీ అధికారులు ధ్రువీకరించారు.

లే అవుట్ వేసి త‌మ‌కు ప్లాట్లుగా అమ్మిన త‌ర్వాత స‌మ్మిరెడ్డి ఈ భూమిని కొన్న‌ట్టు రికార్డులు సృష్టించార‌ని ప్లాట్ ఓన‌ర్ల అససియేష‌న్ ప్ర‌తినిధుల ఆరోపించారు.

ఇరుప‌క్షాల‌తో పాటు రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారుల‌తో విచారించిన ద‌రిమిలా.. స‌మ్మిరెడ్డి బాల్‌రెడ్డి నిర్మించిన ఫాంహౌస్‌తో పాటు ఏర్పాటు చేసిన ప్ర‌హ‌రీ, ఫెన్సింగ్ కూల్చివేత‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం పోలీస్‌ బందోబ‌స్తు మ‌ధ్య కూల్చివేశారు.

Related Articles

spot_img

Most Popular