కటక్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం ప్రారంభమైన రెండో వన్డే అర్ధంతరంగా నిలిచిపోయింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 304 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అనంతరం ఛేదనకు దిగిన టీమిండియా 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఈ క్రమంలో ప్లడ్ లైట్లు పదేపదే అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్లడ్‌లైట్ల మరమ్మతు తర్వాత మ్యాచ్ ప్రారంభం కానుంది.