తెలంగాణ అక్రిడిటేషన్ జర్నస్టుల పాస్ బస్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత బస్ పాస్ గడువు ఈ నెల 30తో ముగియనుండగా, తాజాగా దీనిని సెప్టెంబర్ 30వరకు పొడిగిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవలే ఉత్తర్వులిచ్చింది.
ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ సైతం బస్ పాసుల గడువును పొడిగించినట్లు పేర్కొంది. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులు రాయితీ బస్ పాస్ కోసం మంగళవారం నుంచి గతంలో మాదిరిగానే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
దరఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలతోపాటు ఫొటో, అక్రిడిటేషన్ కార్డు తప్పకుండా అప్‌లోడ్ చేయాలని, ఆ తర్వాత బస్‌పాస్ కలెక్షన్ సెంటర్‌నూ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
సమాచార, పౌర సంబంధాల శాఖ ఆన్‌లైన్ అప్లికేషన్లు ధ్రువీకరించిన తర్వాతే టీజీఎస్ ఆర్టీసీ బస్‌పాస్‌లను జారీ చేస్తుంది.
బస్ పాస్ కోసం https://tgsrtcpass.com/journalist.do?category=Fresh ఈ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.