పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం
*భామ్ల నాయక్ తండాలో సంత్ సేవలాల్ మహారాజ్, మేరమ్మ తల్లి ఆలయ భూమి పూజలో పాల్గొన్న TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దుద్దిల్ల శ్రీను బాబు.
మంథని : నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని భామ్ల నాయక్ తండా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సంత్ సేవలాల్ మహారాజ్ మరియు మేరమ్మ తల్లి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తై గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
ఆలయాలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

