Monday, June 22, 2026

Buy now

ఎమ్మెల్యే సహకారంతో సమస్యలు పరిష్కరిస్తా: రామగుండం మేయర్

రామగుండం: ఎమ్మెల్యే సహకారంతో ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హామీ ఇచ్చారు. గురువారం ఆయన ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రినీ సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్,ఆర్ ఎం ఓ కృపా బాయ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి నోటు పుస్తకాలు,పెన్ను లు అందజేశారు.

ఈ సందర్భం గా ఆసుపత్రి సమస్యలను ఆయన అడిగి తెలుసుకు న్నారు.తరచుగా విద్యుత్ సమస్య తలెత్తుతుందని వైద్యులు ఆయన దృష్టికి తీసుకురాగా ఎన్ పి డి సి ఎల్ అధికారులతో ఫోన్ లోమాట్లాడి వెంటనే చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నగరాన్ని ఒక ప్రదాన వైద్య కేంద్రంగా తీర్చి దిద్దాడానికి ఎం ఎల్ ఎ రాజ్ ఠాకూర్ కృషి చేస్తున్నారని,ఆయన ఆశయా లకు అనుగుణంగా పేషంట్లకు ఉత్తమ వైద్య సేవలందించాలని అన్నారు.

అత్యవసర సమయం లో త్వరితగతినస్పందించాలని అన్నారు.పేషంట్లు,వారిబంధువులతో ఓర్పుగా నడుచు కుంటూ వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు.కాగా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ కంకణాల మౌనిక భర్త రాజును పరామర్శించారు.

వైద్య చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ గట్ల రమేష్, యుగంధర్,వైద్యులు నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

Related Articles

spot_img

Most Popular