పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తనిఖీ నిర్వహించిన ఎక్సైజ్ శాఖ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లో గుడుంబా పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. గురువారం కాలువ శ్రీరాంపూర్ మండలంలో తారుపల్లి. కాల్ శ్రీరాంపూర్ వడ్డెర కాలనీ ప్రాంతంలో భారీ ఎత్తున డిటిఎఫ్ టీం నిర్వహించిన తనిఖీల్లో గుడుంబా తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్ ఎక్సైజ్ శాఖ ఎస్సై చిరంజీవి. కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై వెంకట్ బృందం.
పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ బృందం కలిసి నిర్వహించిన భారీ తనిఖీల్లో పల్లెలపై దాడులు నిర్వహించగా గుడుంబా తయారీదారులు నిర్వహించే ప్రాంతాలను గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గుడుంబాకు ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో గుడుంబాను కాస్తున్నట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గుడుంబా ను తయారు చేసినట్లయితే ప్రభుత్వం చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలు పాలు కావడం జరుగుతుందని అన్నారు. గుడుంబా పై నిషేధాజ్ఞలు ఉన్నాయని అందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన నిర్ణయాల మేరకు గుడుంబా తయారీపై దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీ వాసులు. బత్తిని హేమలత అనే మహిళ వద్ద ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ సురేష్ అక్షర కవితకోటేష్ రాజు అనిల్ పరశురాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

