Wednesday, June 24, 2026

Buy now

డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి:ఎస్పీ మహేష్ బి గితే

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాల ప్రారంభోత్సవనికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈసందర్భంగా గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు,రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,”నేను సైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల సహకారంతో జిల్లాలో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆధునిక సాంకేతికతతో నేరాలను అరికట్టి నిందితులపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతూ, యువతను మత్తు పదార్థాల దుష్ప్రభావాల నుంచి రక్షించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలి.
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణిచాలని ప్రజలకు సూచించారు.అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచమన్నారు.

కోరుట్లపేట గ్రామంలో ఒక రోడ్డు ప్రమాదం జరగకపోవడం కోరుట్లపేట గ్రామ ప్రజల అవగాహనకు నిదర్శనంగా నిలిచిందన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,పరిమితి కి మించిన వేగంతో వాహనాలు నడపవద్దని ,రాంగ్ రూట్‌లో ప్రయాణించవద్దన్నారు. ఈ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ఈకార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్,ఎస్.ఐ రాహుల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Related Articles

spot_img

Most Popular