భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఈఎస్ కే.తిరుపతి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సి.హెచ్.శ్రీహరిరావు సిబ్బంది కలిసి కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే మార్గం లో గల ఇసుక రీచ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చుచున్న ఒక పల్సర్ 150 వాహనం (నెంబర్ ప్లేట్ లేదు)ని ఆపి తనిఖీ చేయగా దానిలో 21.100 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది, ఇట్టి గంజాయిని మహారాష్ట్రకు చెందిన ఏ 1)అజార్ షకీల్ షేక్, ఏ 2) అంకుష్ వినాయక్ పవార్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు నుండి తుల్జానగర్ మహారాష్ట్ర కు తరలిస్తూ పట్టుబడినారు .
తదుపరి భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు వాహన తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం హీరో గ్లామర్ ( ఏపీ 04 ఏ వి 4074 )ని ఆపి పరిశీలించి చూడగా దానిపై ఉన్న తెల్లని ప్లాస్టిక్ సంచిలో మూడు ప్లాస్టిక్ కాన్ ల లో గల 30 లీటర్ల నాటు సారాయి లభ్యమైంది,ఇట్టి నాటు సారాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎర్రగుంట కు చెందిన ఏ 1) మడవి ఐత, ఏ 2) కూరం అర్జున్ , ఎర్రగుంట నుండి భద్రాచలం కి తరలిస్తూ పట్టుబడినారు.
తదుపరి వారిపై వేరు వేరు గా కేసు లు నమోదు చేసి, ఈ మొత్తం రెండు ద్విచక్ర వాహనాలలో లభ్యమైన 21.100 కేజీల ఎండు గంజాయిని,30 లీటర్ల నాటు సారాయి,ని రెండు ద్విచక్ర వాహనాలను, రెండు సెల్ ఫోన్ల ను (వీటి మొత్తం విలువ సుమారు రూ.12 లక్షలు) సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించడమైనది.
ఇట్టి తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుల్స్ శివకుమార్, వీరబాబు ,తిరుపతి,
ఉపేందర్ , డ్రైవర్ సాయి కుమార్ లు పాల్గొన్నారు. నోట్ ఏదైనా గంజాయి మరియు మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ తెలియజేశారు..

