హైదరాబాదు: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని రవీంద్రభారతిలో TRR మెడికల్ కాలేజ్ విద్యార్థుల కాన్వికేషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా TRR మెడికల్ కాలేజీ లో MBBS తొలి బ్యాచ్ పూర్తి చేసుకున్న మెడికల్ విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. నాణ్యమైన వైద్య విద్య బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో సామాన్యుడికి 90% వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టమన్నారు. త్వరలో TIMS ఆస్పత్రుల సేవలను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే T. రామ్మోహన్ రెడ్డి, DME డాక్టర్ నరేంద్ర కుమార్, టి ఆర్ ఆర్ కాలేజీ యాజమాన్యం, ఫ్యాకల్టీ, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

