పెద్దపల్లి జిల్లా: మంథని నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి), కల్యాణలక్ష్మి పథకాల చెక్కులను పంపిణీ చేశారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పాలకుర్తి తదితర మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ కింద 64 మంది లబ్ధిదారులకు రూ.21.41 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
అదేవిధంగా మంథని నియోజకవర్గ పరిధిలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.45.05 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు.
మంథని మండలానికి 29, ముత్తారం మండలానికి 9, రామగిరి మండలానికి 7, కమాన్‌పూర్ మండలానికి 8, పాలకుర్తి మండలానికి 4 చెక్కులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నామని, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో తోడ్పడుతోందని పేర్కొన్నారు.

