Wednesday, June 24, 2026

Buy now

విజిబుల్ పోలీసింగ్‌తోనే నేరాల నియంత్రణ సాధ్యం : మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్

మంచిర్యాల: నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్ చేపట్టాలని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు. శనివారం ఆయన మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీసీపీ, స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు.

స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ రికార్డులను తనిఖీ చేశారు. నమోదవుతున్న కేసుల వివరాలు, రౌడీషీటర్ల వివరాలు, నేరాల స్వభావం, కేసుల పురోగతి తదితర అంశాలను తెలుసుకున్నారు.రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.

నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అత్యవసరమని, నిరంతర పెట్రోలింగ్‌తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి,ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధికి సంబంధించిన వివిధ అంశాలను సీఐ రమేష్ డీసీపీకి వివరించారు.ఈ తనిఖీలలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్,ఎస్‌ఐ నరేష్ పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular