Friday, August 14, 2026

Buy now

ఇంద్రవెల్లి మండలంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పర్యటన

# పిట్టబొంగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. కలెక్టర్‌, ఐటీడీఏ పీవోతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పర్యటించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరంద్‌తో కలిసి పిట్టబొంగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టర్‌, ఐటీడీఏ పీవోతో కలిసి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్‌ కట్‌ చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడే అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు. గ్రామస్తులంతా ఐక్యతతో ఉంటూ గ్రామ అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులకు సహకరించాలని కోరారు.

రేపటి నుంచి ప్రారంభమయ్యే నూతన డిజిటల్‌ రేషన్‌ కార్డుల పంపిణీతో పాటు పెన్షన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular