Wednesday, September 16, 2026

Buy now

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి కక్కిరాలపల్లి సర్పంచ్ దంపతులు

* ఐనవోలు మండలంలో కాంగ్రెస్‌లో చేరిన బర్ల వాణి రవికుమార్ దంపతులు

వరంగల్: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ సర్పంచ్ బర్ల వాణి, రవికుమార్ దంపతులు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్‌లోకి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు బర్ల వాణి, రవికుమార్ తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

అనంతరం మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సర్పంచ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నూతనంగా కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ దంపతులను అభినందించారు.కార్యక్రమంలో ఐనవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular