Wednesday, September 16, 2026

Buy now

మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: జనక్ ప్రసాద్

* సింగరేణిలో క్రెచ్‌లు, పని ప్రదేశాల్లో సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం

కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం రీజియన్‌లో మహిళా కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి INTUC కృషి చేస్తుందని ఆ సంఘం సెక్రటరీ జనరల్ డా. జనక్ ప్రసాద్ తెలిపారు.కొత్తగూడెంలోని INTUC కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు శేషరత్నం అధ్యక్షతన రీజియన్ మహిళా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జనక్ ప్రసాద్ మహిళా కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.

క్రెచ్‌ల ఏర్పాటు, క్యాడర్ స్కీమ్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలు, రెస్ట్ రూమ్‌లు, హాఫ్‌డే లీవ్స్, మహిళలకు ప్రత్యేక సెలవులు తదితర అంశాలను మహిళా నాయకురాళ్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్ని ఏరియాల్లో వీలైనంత త్వరగా క్రెచ్‌లు ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తామని జనక్ ప్రసాద్ తెలిపారు.

మహిళా ఉద్యోగులు, కార్మికులకు మెరుగైన పని వాతావరణం, హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం యాజమాన్యంతో చర్చిస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు, బోనస్, మెడికల్ ఇన్సూరెన్స్ తదితర సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని తెలిపారు.కార్మికుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు, పార్కులపై పన్ను యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సమావేశంలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పేతంబరం, మహిళా నాయకురాళ్లు లలిత లక్ష్మి, నాగ హేమరెడ్డి, స్వప్నరెడ్డి, శారద, లలితశ్రీ, కృష్ణవేణి, దివ్య, మానస, గౌతమి, అరుణ తదితరులతో పాటు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ రజాక్, రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, సెక్రటరీ అభిషేక్, పిట్ సెక్రటరీలు సంజిత్, సాగర్, సురేందర్ పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular