# పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాలపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో చర్చ
హైదరాబాద్: సంఘటన్ సృజన్ అభియాన్ (SSA)లో భాగంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన వన్-టు-వన్ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో శ్రీను బాబు సమావేశమై పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలు, కమిటీల పనితీరు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
మంథని, మధిర, రామగుండం, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR) కార్యకలాపాలపై కూడా శ్రీను బాబు సమావేశంలో వివరించారు.
2025 జూన్ 29న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పటి నుంచి నిర్వహించిన పార్టీ బాధ్యతలు, చేపట్టిన కార్యక్రమాలు, సంస్థాగత కార్యకలాపాలు, వివిధ కమిటీలకు సంబంధించిన వివరాలను ఆయన ఏఐసీసీ కార్యదర్శికి సమర్పించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు తెలిపారు.

