Friday, August 14, 2026

Buy now

కాలనీవాసుల రక్షణకు సీసీ కెమెరాలు నిఘా

* పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి
* ఘనంగా ఏసిపి బర్తడే వేడుకలు
* లక్ష్మీ నగర్ లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ప్రారంభం

పెద్దపల్లి : కాలనీవాసుల రక్షణకు సీసీ కెమెరాల నిఘా ఎంతో అవసరం అన్నారు. పదవ వార్డ్ కౌన్సిలర్ అక్క పెళ్లి సుజాత క్రాంతి సహకారంతో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలు డిసిపి రామ్ రెడ్డి పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ నగర్ కాలనీ సొసైటీ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనియమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు రక్షణ కవచంగా ఉంటుందని అన్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని సూచించారు. కాలనీతోపాటు ప్రతి ఇంటి వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులను కోరారు. అనంతరం పెద్దపళ్లి ఏసిపి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పడవ వార్డు కౌన్సిలర్, లక్ష్మీ నగర్ హౌస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఏసిపి తో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ అక్కేపల్లి సుజాత క్రాంతి కుమార్ లతోపాటు డిసిపి, ఏసిపి, సీఐ, ఎస్సైలను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు నరేష్ లు, పోలీస్ సిబ్బంది లక్ష్మీ నగర్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular