ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు శుక్రవారం ఏదుల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు రాము యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏదుల మండల ఇంచార్జ్ సురేందర్ యాదవ్, బీజేపీ జిల్లా కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌పేట మండల ఇంచార్జ్ దాసరాజు ప్రవీణ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

