Tuesday, June 23, 2026

Buy now

నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటా:ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం – ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్.ఎల్. పి. విప్. కె. పి. వివేకానంద.
విస్పర్ వ్యాలీ కాలనీ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా..

ఈ రోజు బాచుపల్లి – నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని 274వ వార్డు, రాజీవ్ గాంధీ నగర్‌లో ఉన్న విస్పర్ వ్యాలీ కాలనీ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులను అభినందించి, కాలనీ అభివృద్ధి కోసం తన సంపూర్ణ సహకారం మరియు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం కమిటీ సభ్యులు కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు, వీధి దీపాల కొరత తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

వారి వినతిని సానుకూలంగా స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి, ఆయా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాలాజీ నాయక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు చంద్రగిరి సతీష్, 20వ వార్డు బి.ఆర్.ఎస్. పార్టీ మహిళా అధ్యక్షురాలు సంధ్యా రాణి, ఉపాధ్యక్షురాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి నాగమణి, సోషల్ మీడియా అధ్యక్షుడు విద్యాసాగర్, మరియు సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షుడు ప్రసాద్ రాజు, ప్రధాన కార్యదర్శి లీలావతి, సంయుక్త కార్యదర్శి పృథ్వీ కుమార్, కోశాధికారి రామకృష్ణ బండి, సత్యం వ్యాలీ వాసులు చిట్టిబాబు గారు, ప్రసాద్, రామ్ ప్రసాద్, అశోక్, రదీప్, రవితేజ ఉన్నారు

Related Articles

spot_img

Most Popular