నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం: డా “ఎర్రోళ్ల శ్రీనివాస్,మాజీ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్.
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? ముఖ్యమంత్రి ( Anumula Revanth Reddy ) రేవంత్ రెడ్డి.
ఎన్నికల్లో నిరుద్యోగుల వాడుకొని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ,ఇప్పుడు వాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతోంది కాంగ్రెస్ సర్కార్,”నిరుద్యోగులను తడి గుడ్డతో గొంతు కోసిన ప్రభుత్వం… ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం, నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, జాబ్ క్యాలెండర్ల ఊసే లేదు..లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అన్నారు
ఒకవైపు ముఖ్యమంత్రి ఢిల్లీ , విదేశీ పర్యటనలు, పెట్టుబడుల ప్రచారాలతో బిజీగా ఉంటే, మరోవైపు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోతుంది అని అన్నారు
“ఉద్యోగాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు యువత ఆశలతో చెలగాటమాడుతున్నారా? Telangana CMO
పోటీ పరీక్షల కోసం కుటుంబాలకు భారం అవుతూ లక్షల రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అని అన్నారు.
ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దిల్సుఖ్నగర్లో వందలాది మంది నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది.
తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
“ఉద్యోగం మా హక్కు – హామీలు కాదు, నియామకాలు కావాలి” అంటూ నిరుద్యోగ యువత ప్రభుత్వం ని డిమాండ్ చేస్తుంది…
తక్షణమే నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి,, అసెంబ్లీలో చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ
డిమాండ్ భవిష్యత్తు లో నిరుద్యోగుల తరుపున BRS పార్టీ నుంచి ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధం అని అన్నారు.

