మెదక్ జిల్లా పోలీసు శాఖలో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 80 మంది కానిస్టేబుళ్లకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్‌లు కేటాయించారు. సీనియారిటీ, స్పౌస్ ఉద్యోగ స్థానం, ఆరోగ్య పరిస్థితులు, పిల్లల విద్య, సర్వీస్ రికార్డు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తిస్థాయి పారదర్శకతతో బదిలీల ప్రక్రియను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు,మాట్లాడుతూ, పారదర్శక బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంపొందించి సమర్థవంతమైన పోలీసింగ్‌కు బలమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
కొత్తగా పోస్టింగ్‌లు పొందిన కానిస్టేబుళ్లు తమ విధుల్లో అంకితభావంతో పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

