కామారెడ్డి:జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ మండల కేంద్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి విద్య ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, విద్యాభివృద్ధే సమాజ ప్రగతికి బలమైన పునాది అని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న బడిబాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో చందర్ నాయక్, భుజంగారి భాస్కర్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి తిరుపతయ్య, ఉప నిరీక్షకుడు మురళి తదితరులు పాల్గొన్నారు.

