రామగుండం:అంటువ్యాధుల నుండి అప్రమత్తంగా ఉండాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం 46 వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ ప్రాంతం లో పర్యటించారు.ఈ సంధర్భం గా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు, ఈగలకు నిలయమై అంటు వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుందని అన్నారు.డెంగ్యూ,మలేరియా వంటి అంటు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగ వలసి వస్తుందని అన్నారు. కాబట్టి చెత్త బహిరంగ ప్రదేశాల లలో,కాలువల్లో వేయకుండా నగర పాలక సంస్థవాహనాలకు అందించాలని కోరారు.
కాగా ఈ సందర్భంగా సంజయ్ గాంధీ నగర్ రోడ్ లో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్డుకు ఇరువైపులా దారికి అడ్డంగా పెరిగిన పొదలు,చెట్ల కొమ్మలు, నాలా శుభ్రం చేయడానికి వీల్లేకుండా పైన పరిచిన రాళ్ళ ను తొలగించారు.నాలాలలో పూడిక తొలగించారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు,నగర పాలక సంస్థ అధికారులు నవీన్,మీర్, పబ్బాల శ్రీనివాస్,సంపత్, చంద్రా రెడ్డి,మెప్మా సి ఓ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.

