Tuesday, June 23, 2026

Buy now

స్వచ్చ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి:రామగుండం నగర మేయర్

రామగుండం: అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వాహనం వచ్చేలా వీధులు వెడల్పు చేసేందుకు స్థానికులు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా స్థానిక కార్పొరేటర్ ఇసంపల్లి అంజయ్య తో కలిసి శనివారం 30 వ డివిజన్లోని రామగుండం ఖాదర్ కాలనీ,ఇందిరా నగర్, రహమత్ నగర్ , భీమయ్య కాలనీ,వడ్డెర గూడెం,ఇ ఎస్ ఐ కాలనీ,టెంపుల్ ఏరియా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

డివిజన్ లోని కాలువల్లో పూడికతొలగించడం తో పాటు దారికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు పిచ్చి చెట్లు తొలగించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన రామగుండం ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ది చేసేందుకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రూ 20.00 కోట్ల నిధులు తీసుకువచ్చి పనులు చేయిస్తు న్నారని అన్నారు.

ప్రస్తుతం రామగుండంలో జరుగుతున్న రోడ్డు,సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులతో పట్టణ రూపు రేఖలు మారి పోయాయని అన్నారు. ఆయన ఆశయానికి తగ్గట్టుగా 30 వ డివిజన్ లో వీధులు కూడా వెడల్పు చేయడానికి, ప్రదాన వీధి రోడ్డు కనీసం 20 అడుగులు వుండేలా మార్కింగ్ ఇస్తున్నామని అన్నారు.

మార్కింగ్ అనుసరించి వారం రోజుల్లోపు స్వచ్చందoగా తొలగించుకుంటే పది రోజుల్లో రోడ్డు నిర్మాణ పని ప్రారంభమ య్యేలా చూస్తామని అన్నారు. ప్రతి వీధిలో చివరి ఇంటి వరకు కూడా యు జి డి ,రోడ్డు,నల్లా, వీధి దీపాల వంటి అన్ని రకాల మౌళిక వసతులు కల్పించాలని ఎంఎల్ఏ సంకల్పించారని తదనుగుణంగా తాము పనులు చేపడుతున్నామని అన్నారు.

నీటి కొరత తీరేందుకు రామగుండం ప్రాంతంలో మరో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేపడతామని అన్నారు. స్వచ్చ రామగుండంగా తీర్చిది ద్దేందుకు ప్రజలుసహకరించాల ని కోరారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, ఎ.ఇ తేజస్వి ని,టిపిఎస్ నవీన్, సానిటరి ఇన్స్పెక్టర్ సంపత్, జూనియర్ అసిస్టెంట్ చంద్రా రెడ్డి,పలువురు కార్పొరేటర్లు, కాలనీ వాసులు,నాయకులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular