Wednesday, June 24, 2026

Buy now

12 ఏళ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో పరుగులు :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క

సిరిసిల్ల: కేంద్ర నిధులతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు. మరింత అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో డబల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు.మోదీ 12ఏళ్ల పాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలన మచ్చలేని ఆదర్శన వలన కొనసాగుతుందన్నారు.

మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయని పేర్కొన్నారు.
2014 లో మోదీ ప్రధానిగా ఎన్నికైన రోజున భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలో 18వ స్థానంలో ఉండగా, నేడు 3 వ స్థానానికి తీసుకొచ్చారని తెలిపారు.2047 కల్లా ప్రపంచంలోనే మన దేశం ఆర్థికంగా మొదటి స్థానంలోకి తీసుకు రావాలని మోదీ సంకల్పించారనీచెప్పారు.

12 ఏళ్ల పాలనలో రక్షణ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. రక్షణ ఆయుధాలను దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి అదునాతన యుద్ధ విమానాలను ఎగుమతి చేసుకునే స్థాయికి తీసుకొచ్చారని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన రక్షణ శాఖ బలం ఏంటో ప్రపంచానికి తెలియచేసింది మోడీ యేనని గుర్తు చేశారు.

ప్రపంచమే కీర్తించేలా విదేశీ సంబందాలలో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గౌరవం తెచ్చారన్నారు. ఒకప్పుడు అమెరికా చెప్పిన షరతులకు లోబడే పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడు మనం షరతులు పెట్టె పరిస్థితికి వచ్చా మన్నారు. యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం పెట్రోల్, డిజిల్ కొరతతో అల్లాడుతుంటే, మోదీ విజన్ తో దేశంలో పుష్కలంగా ఆయిల్ దొరుకుతుందన్నారు. పరిస్థితి ముందుగానే ఉహించి రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఇబ్బందులు లేకుండా చేశారని తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర్ నిర్మాణం, కామన్ సివిల్ కోడ్ అమలు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, ఇలా ఎన్నో విజయాలు మోడీ సాధించారని కొనియాడారు. మరో 16 విదేశీ యూనివర్సిటీలు ఈ దేశానికి తీసుకు రాబోతున్నారనీ తెలిపారు. హైవేస్, రైల్వేస్టేషన్, ఎయిర్పోర్ట్ లు అందునాతనంగా తీర్చిదిద్దుతున్నానీ చెప్పారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు,
చెన్నమనేని వికాస్ రావు, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, నాయకులు ఎర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular