Wednesday, June 24, 2026

Buy now

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం :రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదివాసీల ఆచార సంప్రదాయాలు దేశానికి ఆదర్శమని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు.

లబ్ధిదారులు నైతం కవిత-సోము, తొడసం సుదర్శన్‌-మధుబాయి, సీతాబాయి-దేవురావు కుటుంబాలకు చెందిన నూతన గృహాలను మంత్రి పరిశీలించి, ప్రభుత్వ సహాయంతో సొంతింటి కల నెరవేరడం సంతోషకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రిమ్మ గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇప్పటి వరకు 69 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా అర్హులైన కుటుంబాలకు అదనపు గృహాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గ్రామానికి అవసరమైన బీటీ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
గ్రామంలో గ్రంథాలయ నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్‌ కార్డులు, సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు.
మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రిమ్మ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం చిట్టచివరి లబ్ధిదారుడికి చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజలందరూ సమష్టిగా సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, సర్పంచ్ పెందుర్ జంగుబాయి,
ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular