తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలలో ప్రెస్ మీట్..
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..
🔹మంచిర్యాల ఎమ్మెల్యే గుండాగిరి బంద్ చెయ్
🔹ఈ గడ్డ మీది నుంచే తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేస్తుంది
🔹ఈ ప్రాంత ప్రజల ప్రేమను పొంది అన్ని చోట్ల టీఆర్ఎస్ జెండా ఎగురేస్తాం
🔹కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగానే సింగరేణి సంస్థ నష్టపోతోంది
🔹కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు
🔹గుంటనక్క మాయలో కిషన్ రెడ్డి పడ్డాడు.. ఆయన లేఖ రాయగానే ఈయన ఆరా తీస్తుండు
🔹మేము సింగరేణికి వెళ్తున్నామని తెలిసే గుంటనక్క అక్కడకు వచ్చింది
🔹సింగరేణి హక్కులను కాపాడేది హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మాత్రమే
🔹జీఎం చేసే పనులను సీఎం, క్లర్క్ చేసే పనులను డిప్యూటీ సీఎం చేస్తున్నారు
🔹న్యాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉండి ప్రతిపక్షాల మాదిరిగా కార్మికుల దగ్గరకు వస్తున్నారు
🔹కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం వాటికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి
🔹కిషన్ రెడ్డి ఈ భూమి పుత్రుడైతే సింగరేణికి మేలు చేయాలి
🔹మంచిర్యాల నుంచే బొగ్గుబాయి యాత్ర ప్రారంభించుకోవటం ఆనందంగా ఉంది.
🔹తెలంగాణలో మేము ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేనను ప్రారంభించాం.
🔹రైతులు, సింగరేణి కార్మికులు ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడుతున్నాం.
🔹ఇవ్వాళ సింగరేణిలో చాలా మంది కార్మికులను తగ్గించే కుట్ర చేస్తున్నారు.
🔹ఓపెన్ కాస్ట్ అంటూ కార్మికులను తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
🔹కానీ అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా ఇంకా ఎక్కువ మైనింగ్ చేయవచ్చు.
🔹అదే విధంగా తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చు.
🔹కానీ సింగరేణిలో కార్మికులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించటం లేదు.
🔹ఆఫీసర్లకు ఒక న్యాయం, కార్మికుడికి ఒక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
🔹కొంచెం లేట్ అయిన సరే అటెండెన్స్ వేయమంటూ వేధిస్తున్నారు.
🔹సింగరేణిలో ప్రతి శనివారం ఉద్యోగాల జాతర జరగాలి. కానీ ఇక్కడ ఎంత మంది సస్పెండ్ చేద్దామా అని లెక్కలు వేస్తున్నారు.
🔹ప్రభుత్వం అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది.
🔹సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు అన్ని ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
🔹డిప్యూటూ సీఎం భట్టి గారు అంతా తన కనుసన్నల్లోనే జరగాలనే ప్రయత్నం చేస్తున్నారు.
🔹కార్మికుల హక్కులను హరిస్తూ వారిపై శాడిజం చూపిస్తున్నారు.
🔹సింగరేణి కార్మికులకు సరైన వసతులు కల్పిస్తే బంగారం పండిస్తారు.
🔹ప్రతి గని లో పరిస్థితిని మేము గమినించాం. కార్మికులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
🔹కార్మికులతో వెట్టి చాకిరి చేయించటం సరికాదు.
🔹గుజరాత్ లో గుజరాత్ మినరల్స్ అనే కార్పొరేషన్ ఉంది.
🔹మైనింగ్, మినరల్స్ అన్ని కూడా దాని ద్వారానే నడుస్తాయి.
🔹అదే విధానంలో మనం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలి.
🔹మేము కచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చాక గుజరాత్ లో మాదిరిగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.
🔹సింగరేణిలో మైన్ డెవలప్ మెంట్ విధానం తెస్తే అండర్ గ్రౌండ్ మైనింగ్ కూడా చేసుకోవచ్చు.
🔹ఇక్కడ ఉండే ఎండీవో సిస్టమ్ ను పూర్తిగా రద్దు చేయాలి.
🔹సింగరేణి విషయంలో నిజాం రాజు చాలా గొప్ప పని చేశారు.
🔹తెలంగాణలో గోదావరి పరివాహాకంలో ఉన్న బొగ్గు అంతా కూడా సింగరేణికే రాసిచ్చారు.
🔹కానీ కాంగ్రెస్ చేసిన స్కాం కారణంగా మనకు నష్టం వచ్చింది.
🔹ఆ బొగ్గు కుంభకోణాన్ని సాకుగా చూపి…బీజేపీ అధికారంలోకి వచ్చాక 250 బ్లాక్స్ ను జాతీయం చేసింది.
🔹మన సత్తుపల్లిలో కోల్ మైన్స్ పోతే సింగరేణి కూడా నష్టపోవాల్సి ఉంటుంది.
🔹కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే అయితే మన తెలంగాణకు ఎక్కువ బ్లాక్ లు వచ్చేలా ప్రయత్నం చేయాలి.
🔹మన కార్మికులకు ఐటీ తీసేయాలని మేము డిమాండ్ చేస్తే…అధికారంలోకి వచ్చాక తీసేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నాడు.
🔹అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం కల్ల.
🔹కానీ బీజేపీ విధానం ఏ విధంగా ఉందో కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
🔹కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం.
🔹ఆ నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తెలంగాణలో అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి.
🔹కిషన్ రెడ్డి కూడా గుంటనక్క మాయలో పడ్డారు. గుంటనక్క లేఖ రాయగానే ఆయన కూడా లేఖ రాశారు.
🔹మేము సింగరేణికి వస్తున్నామని తెలిసి…గుంటనక్క హడావుడిగా ఇక్కడకు వచ్చారు.
🔹గుంటనక్క లేఖ రాయగానే బొగ్గు బ్లాక్ ల గురించి కిషన్ రెడ్డి ఆరా తీస్తున్నారు.
🔹కానీ అది ఎప్పుడో జరిగింది. మేము వస్తున్నామని తెలిసి ఇప్పుడు లేఖ రాశారు.
🔹కిషన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు ఎక్కువ కోల్ బ్లాక్స్ అలకేట్ చేయించాలి.
🔹సింగరేణి కార్మికులకు ఐటీ లేకుండా చేయాలి. పెన్షన్ కూడా రివిజన్ చేయాలి.
🔹మన కార్మికులం కష్టాల్లో ఉంటే ఏఐటీయూసీ దొంగ సమ్మెకు దిగింది.
🔹కార్మికుల ఐక్యతను, సమ్మె స్ఫూర్తిని దెబ్బ తీసేలా సమ్మె చేయాలని నిర్ణయించటం కార్మికులకు అన్యాయం చేయటమే.
🔹ముఖ్యంగా మనం డిపెండెంట్ ఉద్యోగాలను సాధించుకోవాల్సిన అవసరముంది.
🔹దానికోసం మనం, బీఆర్ఎస్ విపక్షాలుగా వచ్చాం. కానీ ప్రభుత్వం కూడా వచ్చి దొంగ నాటకాలు ఆడుతోంది.
🔹గతంలో సింగరేణిలో వచ్చే పోస్టులను జీఎం ఇచ్చే వారు కానీ ఇప్పుడు వాటిని సీఎం ఇస్తున్నాడు.
🔹జీఎం చేయాల్సిన పనులను సీఎం చేస్తుంటే…క్లర్క్ చేయాల్సిన పనులను డిప్యూటీ సీఎం చేస్తున్నాడు.
🔹ముందు ఈ ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న మొత్తం అప్పు కట్టాలి.
🔹నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి.
🔹కానీ ప్రతిపక్షాల మాదిరిగా మీరే కార్మికుల వద్దకు తిరుగుతామంటే కుదరదు.
🔹అదే విధంగా కార్మికులకు గతంలో హెయ్యెస్ట్ వాటా ఎప్పుడు ఇచ్చారో దాని మీద 10 వేలు ఎక్కువగా ఇవ్వాలి.
🔹సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన విద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీయే.
🔹అలియాస్ నేమ్స్ విషయంలో కార్మికులను ఇబ్బంది పెట్టకుండా వారికి మంచి చేయాలి.
🔹అదే విధంగా సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం ఉంది.
🔹అందుకోసం ప్రభుత్వం వారికి 250 గజాల స్థలం ఇవ్వాలి.
🔹మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇళ్లు కట్టుకునేందుకు 250 గజాల స్థలం ఇస్తాం.
🔹సింగరేణిలో విజిలెన్స్ అనేది జోక్ గా మారింది. పదో తరగతి పాసయ్యారో లేదో విజిలెన్స్ చూస్తుందంట.
🔹అసలు సింగరేణి కార్మికులు పదో తరగతి పాస్ కావాలన్న నిబంధన ఎక్కడ ఉంది.
🔹సింగరేణిలో చదువు ప్రామాణికం కాదు. మ్యాన్ పవర్ తగ్గించేందుకు ఈ కుట్ర చేస్తున్నారు.
🔹డిస్మిసల్ కార్మికులు డిపెంట్ వాళ్లు పెండింగ్ లో ున్నారు. విజిలెన్స్ పాస్
🔹సింగేరణిలో చదువు ప్రామాణికం కాదు. మ్యాన్ పవర్ తగ్గించే కుట్ర మేము కానిచ్చే ప్రస్తక్తే లేదు.
🔹సింగరేణిలో ఇవ్వాల్సిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి.
🔹సూపర్ వైజర్లను ఈ2 లోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్లు ఈ5 వరకు వెళ్తారు.
🔹అదే విధంగా జనరల్ అసిస్టెంట్ సిస్టమ్ ను తేవాలి.
🔹క్లర్క్ పోస్టులకు 9 నెలల క్రితం నోటిఫికేషన్ వేసి ఇప్పటి కూడా ఎగ్జామ్ పెట్టలేదు.
🔹సింగరేణిలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతోంది. వెంటనే ఎగ్జామ్ ను నిర్వహించాలి.
🔹సింగరేణిలో మెషీన్స్ రిపేర్ చేసేందుకు యువతకు అవకాశం ఇవ్వాలి.
🔹వారికి లోన్లు ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది.
🔹మేము అధికారంలోకి వచ్చాక యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి సింగరేణిలో మెషీన్లు రిపేర్ చేసే పరిశ్రమ పెట్టుకునేలా చేస్తాం.
🔹33 వేల కోట్ల రెవెన్యూ ఇచ్చే సంస్థ కళ్లముందే పాడవుతుంటే మాకు చాలా బాధగా ఉంది.
🔹ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కారణంగానే సింగరేణి సంస్థకు నష్టం జరుగుతోంది.
🔹గతంలో నైనీ బ్లాక్ ను ఏదో చేద్దామని చూస్తే మనందరం పోరాటం చేస్తే వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
🔹ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ లో నష్టాల్లో ఉన్న సంస్థతో కలిసి సోలార్ ప్లాంట్ పెడుతున్నారు.
🔹అదే సోలార్ ప్లాంట్ ను మన దగ్గర పెట్టవచ్చు కదా?
🔹రాజస్థాన్ లో పెట్టాలని భావిస్తున్న సోలార్ ప్లాంట్ ను వెంటనే విరమించుకోవాలి.
🔹ఇప్పటికే మేము డిజీల్ కుంభకోణం గురించి చెప్పాం. పేపర్లు కూడా రాసి రాసి అలసిపోయాయి.
🔹కానీ ఇప్పటి వరకు దాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు.
🔹10 లక్షల విలువ లేని సంస్థతో లిథియం ఆయాన్ బ్యాటరీ సంస్థ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
🔹మేము వ్యతిరేకించటంతో అది ఆగింది. కానీ క్యాన్సల్ కాలేదు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి.
🔹సింగరేణి సొమ్మును సీఎం సరాదాలో కోసం ఫుట్ బాల్ మ్యాచ్ ల కోసం ఖర్చు చేస్తున్నారు.
🔹ఆ నిధులను కనీసం కొడంగల్ కూడా కాకుండా తన సరదాలకు ఖర్చు చేస్తున్నాడు.
🔹మంచిర్యాల్ లో ఓసీపీ లో కాంట్రాక్ట్ కార్మికులకు 20 వేలు మాత్రమే వస్తున్నాయి. గోదావరి ఖని, రామగుండంలో మాత్రం రూ. 25 వేలు ఇస్తున్నారు.
🔹అక్కడి ఎమ్మెల్యేలు కొట్లాడి 25 వేలు ఇప్పిస్తున్నారు. అలా అని వాళ్లు సొక్కమైన వాళ్లు కాదు.
🔹వాళ్ల చేసే భారీ అవినీతి గురించి కూడా త్వరలోనే బయటపెడతా.
🔹కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని ఇక్కడి ఎంపీని డిమాండ్ చేస్తున్నా.
🔹తాళ్లపల్లిలో సింగరేణి కోసం భూములు ఇచ్చిన ప్రజలకు పరిహారం ఇవ్వలేదు.
🔹సింగరేణికి భూమి ఇచ్చిన కుటుంబాలకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. కానీ వాళ్లకు ఏమీ ఇవ్వలేదు.
🔹అన్ని రాష్ట్రాల్లో మన కన్నా కూడా కార్మికులకు ఎక్కువ జీతాలు ఉన్నాయి.
🔹అయ్యప్ప ల కోసం మన దగ్గర రైలు ఆగే పరిస్థితి లేదు.
🔹రైలు ఇక్కడ ఆగే విధంగా ఎంపీ ప్రయత్నం చేయాలి.
🔹సింగరేణి ప్రాంతంలో ప్రజలు మొత్తం కాంగ్రెస్ నే గెలిపించారు.
🔹కానీ వాళ్లకు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ మేలు చేయలేదు.
🔹గోదావరి లో కరకట్ట కట్టలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గుండాగిరి చేస్తానంటే ఊరుకునేది లేదు.
🔹మీ గుండాగిరి బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి.
🔹తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నోళ్లం మీరు గుండాగిరికి బయపడతామా?
🔹ఎమ్మెల్యే గుండాగిరి బంద్ చెయ్. మీ గుండాగిరి నడవదు.
🔹మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతోంది.
🔹మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొంది ఇక్కడి అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం అని అన్నారు .

