Friday, August 14, 2026

Buy now

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి:ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

వర్షాకాలానికి పూర్తి సంసిద్ధతతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
పెన్షన్లు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తన ఛాంబర్‌లో, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, నూతన పెన్షన్ల మంజూరు, వన మహోత్సవం, గ్రామాల పారిశుద్ధ్యం, వర్షాకాలం సంసిద్ధత అప్రమత్తత,తాగునీటి సరఫరా,వన మహోత్సవం మొక్కల పెంపకం,తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో ఎక్కడా జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తూ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.

ప్రత్యేక ప్రజా దర్బార్, ప్రజావాణి కార్యక్రమంలో పెన్షన్ల మంజూరు కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేసి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.

వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించే విధంగా ముందస్తు కార్యాచరణ సిద్ధంగా ఉంచాలని సూచించారు.లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, వాగులు, కల్వర్టుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

Related Articles

spot_img

Most Popular