రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”కార్యక్రమం జరిగిన తీరు, సాధించిన ఫలితాలు, విభాగాల వారిగా నిర్వహించిన కార్యక్రమాల పై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
99 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంతో ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయగలిగాం. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్నారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొన్న శాఖాధిపతులు, వారి సిబ్బందిని అభినందించారు.
క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. వారి నుండి వెంటనే వివరణ కోరి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

