Tuesday, June 23, 2026

Buy now

వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

సంగారెడ్డి జిల్లా:వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, డీఎస్పీ గారితో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేస్తూ, అవి సర్వీస్ కాలమంతా ఉపయోగపడతాయని, ప్రతి వస్తువును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న, స్వాధీనపరుచుకున్న లేదా కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను తెలుసుకొని, కేసు ప్రాపర్టీని జాగ్రత్తగా కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని, మిస్సింగ్ మరియు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని ఆదేశించారు.

ఆస్తి సంబంధిత నేరాల విషయంలో అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను (క్రైమ్ ప్రోన్ ఏరియా) బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి, పగలు-రాత్రి బీట్ విధులలో నిఘా పెంచాలని అన్నారు. నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎస్.హెచ్.ఓ కు సూచించడం జరిగింది.
స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యల పరిష్కరిస్తామన్న భరోసా కల్పించాలని అన్నారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కలిగి శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను పరిశీలిస్తూ, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పగలు, రాత్రి బీట్ విధులలో భాగంగా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పాపిలాన్ డివైస్ ద్వారా తనిఖీ చేసి, పాత నేరస్తులను గుర్తించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని, అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయి పట్టు సాధించి, నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.

స్టేషన్ రికార్డులైన పార్ట్-1 నుండి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్-2.0లో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సిబ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సూచించడం జరిగింది.
అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. విధి పరంగా లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వెహికల్ నడిపేటప్పుడు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ తనిఖీల సందర్భంగా జిల్లా ఎస్పీ గారి వెంట సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నయీముద్దీన్, ఎస్‌ఐ విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular