Wednesday, June 24, 2026

Buy now

సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి:టీఆర్ఎస్ చీఫ్

శ్రీరాంపూర్: సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ RK7 మైన్ పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..
అన్నలు లేరని అనుకుంటున్నారమో.. వాళ్లంతా మా పార్టీలోనే ఉన్నారు
సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి,సింగరేణికి ఎక్కువ బ్లాక్ లు వచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలిన్నారు
సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు,మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం,సింగరేణి కార్మికుల కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం కొట్లాడుతాయి,రాష్ట్రంలో మేము కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించాం.”బాయిబాట” ద్వారా మీ వద్దకు వచ్చాం. టీఆర్ఎస్ కు మీ ఆశీర్వాదం కావాలి. ఇక్కడకు వస్తుంటే మాకు మహిళ సూపర్ వైజర్లు ఎదురయ్యారు.ఆనాడు సింగరేణిలో మహిళలు ఉండాలని మేము పార్లమెంట్ లో ఫైట్ చేశాం.ఇవ్వాళ సింగరేణిలో మహిళ ఉద్యోగులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.అయితే ఇక్కడున్న మహిళ ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవు.సింగరేణి చరిత్రలో ఇప్పుడిప్పుడే మహిళ ఉద్యోగులు వస్తున్నారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముంది.ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీతో పాటు పనిచేశాను.రకరకాల కారణాలతో కొత్తగా పార్టీ పెట్టాను. ఇప్పుడు కూడా మీకోసం పనిచేసేందుకు వచ్చాను.
సింగరేణిలో కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చిన సరే డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.కానీ కాంట్రాక్టర్లకు మాత్రం ఇచ్చేందుకు వారికి డబ్బులు ఉన్నాయి.కార్మికులు మాత్రం మెషీన్లను రిపేర్ చేసుకుంటూ వాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు.కార్మికులకు సరైన భద్రత లేదు,కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వటం లేదు.వేరే చోట అత్యాధునిక టెక్నాలజీ వాడుతుంటే ఇక్కడ మాత్రం పాత టెక్నాలజీ వాడుతున్నారు.మైన్ లోకి వెళ్లే కార్మికులకు గాలి కూడా ఇవ్వటం లేదు.గాలి, నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత సింగరేణిదే.ఇప్పటికీ కూడా పాత టెక్నాలజీ వాడుతున్న సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలి. కనీసం సరైన మంచి నీళ్లు కూడా ఇవ్వకపోవటమనేది మానవ హక్కుల ఉల్లంఘననే.మేము మైన్ దగ్గర వెళ్తే నిన్న, ఇవ్వాళ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైన్ మీద మీటింగ్ లు పెట్టలేదా?,మీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మీటింగ్ లు పెట్టలేదా?,కార్మికులను కలిసి వారి బాధలు అడిగితేనే కదా వారికి బాధలు తెలిసేది,కార్మికుల బాధలను తెలుసుకోని పోరాటం చేస్తేనే కదా చట్టాలు వచ్చేది,తల్లి కాంగ్రెస్ తో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడున్న పిల్ల కాంగ్రెస్ తో కొట్లాడలేమా?
సింగరేణిలో ప్రస్తుతం చాలా మంది యువ వయసు ఉన్న వాళ్లు పనిచేస్తున్నారు.ఇప్పటికే ఐటీ కారణంగా రెండు నెలల జీతం పోతుంది.
ఇంకా పిల్లలను మంచి స్కూల్లో చదివించే పరిస్థితి ఎక్కడ ఉంటుంది,వారి పిల్లల కోసం మంచి స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు కావాల్సిన అవసరాలు తీర్చేందుకు డబ్బు ఉంటుంది. కానీ కార్మికుల కోసం ఉండదా? ఇలాంటి వాటిని ప్రశ్నించేందుకే మేము వచ్చాం. గతంలో అన్నలు ఉండటంతో కార్మికుల విషయంలో ఆఫీసర్లు కొంత పద్దతిగా వ్యవహరించే వారు.
ఇప్పుడు అన్నలు పోయారని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కానీ ఆ అన్నలంతా ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన చేస్తమంటే ఊరుకునేది లేదు. కార్మికులను వేధించే అధికారులపై కేసులు పెడతాం.40 వేల మంది కార్మికులకు 80 వేల క్వార్టర్లు ఉన్నాయి. రెండు క్వార్టర్లకు ఒకరి చొప్పున ఇవ్వొచ్చు.కానీ అలా చేయటం లేదు. కార్మికులను అఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు.
కార్మికులకు మంచి చేసే పనులు చేయండి. వారిని ఇబ్బంది పెడితే ఏం వస్తది? డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తున్నారు.
ఆనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను కూడా అన్ ఫిట్ చేయటం లేదు. మొన్న డిప్యూటీ సీఎం వచ్చి 350 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ 2 వేల మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు.
నాలుగు నెలల్లో సర్వీస్ అయిపోతున్న పెద్ద మనిషి కలిసి బాధ పడుతున్నాడు.
ఇప్పటి వరకు కూడా ఆయనను అన్ ఫిట్ చేయలేదు. వాళ్ల పిల్లలకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?
మెడికల్ బోర్డు పాలసీ ఉంది కదా? నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. ఎందుకు పెట్టటం లేదు?
మీ కోసం ఇక్కడకు వచ్చి పోరాటం చేస్తే సీఎం, డిప్యూటీ సీఎం లు స్పందిస్తారని ఇక్కడకు వచ్చాం.
కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బొగ్గు శాఖ మంత్రిగానే ఉన్నారు.
ఇప్పుడు మనం ఉన్న శ్రీరాంపూర్ RK7 మైన్ ను కూడా మూసేసే ప్రయత్నం చేస్తే అడ్డుకొని కాపాడుకున్నారు.
మన గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు మనకే కేటాయించాలి.
కోల్ బ్లాక్స్ కోసం సింగరేణి ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే పరిస్థితి లేకుండా చేయాలి.
మనకు ఎక్కువ బ్లాక్ కేటాయించే ప్రయత్నం కిషన్ రెడ్డి చేయాలి.
సింగరేణి లో చాలా మంది స్కిల్డ్ కార్మికులు ఉన్నారు.
సంస్థను చాలా బాగా నడిపే పరిస్థితి ఉన్నప్పటికీ యాజమాన్యానికి ఆ మనసు రావటం లేదు.
మేము కచ్చితంగా అధికారంలోకి వస్తాం. అండర్ గ్రౌండ్ మైనింగ్ ను తెరుస్తాం.
దాని ద్వారా లక్ష మంది ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది.
సింగరేణి లాభాల్లో కార్మికుల ఇచ్చే వాటా విషయంలోనూ మోసం చేస్తున్నారు.
లాభాలను సగానికి పైగా దాచేస్తున్నారు. అందుకే నేను ఒక ప్రతిపాదన పెడుతున్నా.
గతంలో అత్యధికంగా వాటా ఇచ్చిన దానికన్నా పదివేలు ఎక్కువ ఇవ్వమని కోరుతున్నా.
లాభాల్లో 42 శాతం వాటా అంటే కూడా మన అకౌంట్లోకి తక్కువ డబ్బులు వస్తాయి.
అలియాస్ పేర్ల విషయంలో కూడా కేసులు పెడుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను వేధించవద్దని కోరుతున్నా. అలియాస్ పేర్ల అంశంపై కూడా మేము పోరాటం చేస్తున్నాం.
మైన్ మీటింగ్ లు పెట్టుకోవటం కార్మికుల హక్కు. దాన్ని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదు.
హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ గారు అవినీతి లేని కార్మికుల కోసం పోరాటం చేసే నాయకులు.
ఆయనతో కలిసి టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.టీఆర్ఎస్ ను, హెచ్ఎంఎస్ ను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతున్నా అన్నారు.

Related Articles

spot_img

Most Popular