Monday, June 22, 2026

Buy now

అస్వస్థకు గురై చిన్నారులను పరామర్శించిన:కేటీఆర్,హరీష్ రావు

సిరిసిల్ల:పానీ పూరి తిని అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారులను మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు పరామర్శించారు.

గురువారం జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ లో మంగళవారం పానీ పూరి తిని తీవ్ర అస్వస్థకు గురై 20 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు ఆసుపత్రికి
వచ్చి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, చీటీ నరసింహారావు, బొల్లి రామ్మోహన్ తదితరులున్నారు.

Related Articles

spot_img

Most Popular