Wednesday, June 24, 2026

Buy now

రోడ్డు ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై హైదరాబాద్ నుండి జగిత్యాలకు వస్తున్న షేరింగ్ కారును ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చింత అభిషేక్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న అభిషేక్ సొంతూరు జగిత్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో జగిత్యాల పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

spot_img

Most Popular