సింగరేణి బాయిబాటలో భాగంగా అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ ను సందర్శించి, కార్మికులతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..
🔹ఒక కార్మికుడు తాను పడుతున్న ఇబ్బందులు చెప్తుంటే విని చలించి పోయిన కవిత.. కార్మికుడి బాధలు విని కంటతడి.. తాము అండగా ఉంటామని భరోసా
🔹సింగరేణికి ప్రభుత్వమే విద్రోహిగా తయారైంది
🔹50 వేల కోట్లు బకాయి పెట్టటంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది
🔹కార్మికులకు కనీసం చిన్న చిన్న సౌకర్యాలు కూడా కల్పించటం లేదు
🔹హెచ్ఎంఎస్ ను గెలిపించండి. మీరు కాలర్ ఎగిరేసుకునే చేస్తాం
🔹శ్రీధర్ బాబు.. కార్మికులకు మాకు మధ్యలో వస్తే ఖబడ్దార్
🔹మళ్లీ వెంటబడి మరీ మిమ్మల్ని ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరిస్తున్నా
🔹తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత సింగరేణి కార్మికుల ఆశీర్వాదం కోసం “బాయిబాట” పేరుతో మీ వద్దకు వచ్చాను.
🔹సింగరేణి సంస్థ అత్యధిక రెవెన్యూతో ఉత్తర తెలంగాణకు అన్నం పెడుతోంది.
🔹అలాంటి సంస్థకు చెందిన కార్మికుల మద్దతు కావాలని వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను.
🔹నేను 20 ఏళ్లుగా ప్రజాజీవితంలోనే ఉన్నాను.
🔹ఉద్యమంలో, ఆ తర్వాత ప్రభుత్వంలోనూ మనం కలిసి పనిచేశాం.
🔹కానీ ఇప్పుడు రకరకాల కారణాలతో పార్టీ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకోసమే పనిచేస్తా.
🔹ఇప్పుడు సింగరేణిలో చాలా మంది చదువుకున్న యువత పనిచేస్తోంది.
🔹వాళ్లంతా కూడా లేబర్ చట్టాల గురించి తెలుసుకోవాలి. దాని ద్వారా మన హక్కులను కాపాడుకోవచ్చు.
🔹ఇప్పటికీ కూడా సింగరేణలో బ్రిటీష్ సిస్టం నడుస్తోంది.
🔹కార్మికులను ఆఫీసర్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
🔹అదే విధంగా మేము కార్మికులను కలిసేందుకు వస్తామంటే పోలీసుల్ని పెట్టి మమ్మల్ని నాలుగు రోజులుగా అడ్డుకుంటున్నారు.
🔹అసలు సింగరేణిలోకి పోలీసులకు అనుమతే లేదు. అయిన సరే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు.
🔹మేము ఏఎల్పీ మైన్స్ వస్తున్నామని తెలిసి….మా గేట్ మీటింగ్ కు వెళ్తే జీతం కట్ చేస్తామని చెప్పారంట.
🔹కార్మికుల జీతం కట్ చేస్తే నేను ఇక్కడే ధర్నా చేస్తా.
🔹కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకునే హక్కు నాకు ఉంది. ఏ పార్టీ మీటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకునే హక్కు కార్మికులకు ఉంది.
🔹మంత్రి శ్రీధర్ బాబు గారు గతంలో మాతో పెట్టుకున్నారు.
🔹కొమురం భీమ్ విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా నాతో పాటు కొమురం భీమ్ మనవడిని కూడా అరెస్ట్ చేయించారు.
🔹ఆయన చేసిన తప్పుకు మేము వెంటబడి మరీ ఓడించాం.
🔹మళ్లీ ఇప్పుడు కార్మికులకు మాకు మధ్య వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
🔹అలా చేస్తే ఊరుకోమని శ్రీధర్ బాబును హెచ్చరిస్తున్నా. మళ్లీ వెంటబడి ఓడిస్తామని చెబుతున్నా.
🔹ఏఏల్పీ మైన్ లో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తూ మంచి ప్రయోగం చేస్తున్నారు.
🔹కానీ చాలా మంది కార్మికులు ఇబ్బంది పడుతున్న సరే ఆఫీసర్లు పట్టించుకోవటం లేదు.
🔹ఇప్పుడు ఆఫీసర్లు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారంట. వారి పోరాటాన్ని నేను గౌరవిస్తా.
🔹కానీ హక్కుల మాదిరిగానే కార్మికులకు హక్కులు ఉండవా అని ప్రశ్నిస్తున్నా.
🔹అండర్ గ్రౌండ్ మైనింగ్ లో మెషీనరీ అప్ గ్రేడ్ చేయటం లేదు. సంస్థ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి.
🔹మ్యాన్ చైర్ మీద 45 నిమిషాల పాటు ప్రయాణించి మైన్ చేరటంతో కార్మికులకు వెన్ను నొప్పి వస్తుంది.
🔹వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
🔹ఆఫీసర్లు ముందు కార్మికుల పక్షాన ఉండాలి. అప్పుడు మేము కూడా ఆఫీసర్ల పక్షాన ఉంటాం.
🔹సింగరేణి లో కార్మికులు, ఆఫీసర్లు రెండు కళ్లలాగా పనిచేయాలి.
🔹కానీ ఆఫీసర్లు ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు.
🔹జేఎంఐటీ లో ఉన్న వాళ్లకు 9 ఏళ్లైనా ప్రమోషన్ రాలేదు. వాళ్ల ప్రమోషన్ కోసం మేము కొట్లాడుతాం.
🔹అండర్ గ్రౌండ్ మైన్ లో వారికి కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి.
🔹ఈసారి హెచ్ఎంఎస్ గెలిపించండి. మీరు కాలర్ ఎగిరేసుకునేలా మేము చేస్తాం
🔹సింగరేణి లో అండర్ గ్రౌండ్ మైనింగ్ ఉంటే సంస్థ లైఫ్ ఎక్కువగా ఉంటుంది.
🔹కానీ సంస్థకు ప్రభుత్వమే విద్రోహిగా మారింది. దాదాపు 50 వేల కోట్లు పెండింగ్ పెట్టింది.
🔹దీంతో సింగరేణి సంస్థ డబ్బులకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
🔹చిన్న చిన్న సౌకర్యాలు కూడా కల్పించకుండా కార్మికులను వేధిస్తున్నారు.
🔹సరైన పనిముట్లు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నారు. కానీ ప్రొడక్షన్ టార్గెట్ మాత్రం తగ్గించటం లేదు.
🔹సింగరేణి సంస్థ బాగుండాలంటే మనకు మరిన్ని మైన్స్ ఉండాలి.
🔹నిజాం కాలంలో గోదావరి పరివాహాంలో బొగ్గును సింగరేణికే కేటాయించారు.
🔹కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ హక్కును లాగేసుకొని కార్మికులకు అన్యాయం చేస్తోంది.
🔹మన మైన్స్ ను, హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
🔹కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం మేము పనిచేస్తాం అని అన్నరు.

