తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, మంత్రి వివేక్ కు ఆహ్వానం, అమెరికాలోని డల్లాస్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4,2026 వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక జీ20 సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ వీక్ (G20 Sovereign Wealth Fund Investment Week) కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, గనుల రంగ పురోగతి, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన అంశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించనున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల లక్ష్యాల సాధన కోసం దేనికైనా సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం ఎంతవరకైనా కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ మరియు ఆర్థిక ప్రగతికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

