Monday, June 22, 2026

Buy now

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం

రామగుండం: 48వ డివిజన్ పరిధిలో గల KCR కాలనీ అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడీ బడి బాట” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేణుకుంట్ల నిర్మలాదేవి తిరుపతి చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించడంతో పాటు నూతన దుస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు,బాలింతలకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ,నగర మేయర్ మహంకాళి స్వామి సహకారంతో నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

సీడీపీఓ అలేఖ్య పటేల్ పర్యవేక్షణలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత మెరుగుపడుతోందని, ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయా చిన్నారులు,గర్భిణీలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

48వ డివిజన్ తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలు కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదిని ఇక్కడి నుంచే వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు, తల్లిదండ్రులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular