కరీంనగర్: ఆత్మనిర్భర్ మహిళా పంచాయత్ పోటీలో దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించి కొరటపల్లి గ్రామానికి అరుదైన గౌరవాన్ని తీసుకువచ్చిన గ్రామ సర్పంచ్ మేకల మహేశ్వరి ప్రభాకర్ యాదవ్ ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు.దేశ స్థాయిలో కొరటపల్లి గ్రామ పంచాయతీ ప్రథమ స్థానం సాధించడం పట్ల గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయం కొరటపల్లి గ్రామానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.గ్రామాభివృద్ధి, మహిళా సాధికారత, ప్రజల సహకారంతో సాధించిన ఈ ఘనతపై గ్రామ ప్రజలు గర్వం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని సర్పంచ్ మహేశ్వరి ప్రభాకర్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్ మహేశ్వరి ప్రభాకర్ యాదవ్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సత్కారం.
కరీంనగర్:ఆత్మనిర్భర్ మహిళా పంచాయత్ పోటీలో దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించి కొరటపల్లి గ్రామానికి అరుదైన గౌరవాన్ని తీసుకువచ్చిన గ్రామ సర్పంచ్ మేకల మహేశ్వరి ప్రభాకర్ యాదవ్ ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు.దేశ స్థాయిలో కొరటపల్లి గ్రామ పంచాయతీ ప్రథమ స్థానం సాధించడం పట్ల గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.