Wednesday, June 24, 2026

Buy now

గంబిరావుపేట పోలీస్ స్టేషన్ నితనిఖీ చేసిన: సిరిసిల్ల జిల్లా ఎస్పీ.

సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా శనివారం గంభిరావుపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తు బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు.

నేనుసైతం కార్యక్రమంలో* భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు నేరాల నియంత్రణలో,కేసుల చేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత వివరిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.

విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తు ప్రజలతో మమేకం అవుతూ సైబర్ నేరాలు,రోడ్డు భద్రత నియమాలు , గంజాయి , డ్రగ్స్ వలన కలుగు అనర్ధాలపై విస్తృతంగా అగహన కల్పించాలన్నారు.

గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రస్తుతం వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.

Related Articles

spot_img

Most Popular