AIIMS బీబీనగర్ తొలి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల పాల్గొని, తెలంగాణలో వైద్య సేవలు మరియు వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా AIIMS బీబీనగర్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించడం జరిగింది.
NCC మరియు HITES ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫేజ్-1 నిర్మాణ పనుల పురోగతి, వాటి పూర్తి గడువులు, HMDA కనెక్టివిటీ, TSRTC ప్రజా రవాణా సౌకర్యాలు, ఫైర్ సర్వీసెస్ నుంచి అవసరమైన అనుమతులు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పనులను వేగవంతం చేయాల్సిన అవసరాను ప్రస్తావించడం జరిగింది.
గుర్తింపు పొందిన జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, రోగులు మరియు అత్యవసర సేవలకు ప్రయాణ సమయాన్ని తగ్గించేలా కోడమడుగు గ్రామం వైపు నుంచి యాక్సెస్ రోడ్ ఏర్పాటు చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడం జరిగింది.
అదేవిధంగా విశ్రామ్ సదన్ నిర్మాణం, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల సమర్థ వినియోగం, డెంటిస్ట్రీ విభాగం బలోపేతం వంటి ప్రతిపాదనలపై విస్తృతంగా మాట్లాడడం జరిగింది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఈ అంశాలు కీలకంగా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
AIIMS బీబీనగర్ తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని, అన్ని ప్రాజెక్టులు నిర్ణీత గడువుల్లో పూర్తై అత్యుత్తమ వైద్య సేవలు, వైద్య విద్య మరియు పరిశోధనకు కేంద్రంగా ఎదగాలని సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది.
ఈ సమావేశంలో స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ డా. శైలేంద్ర హండు (AIIMS రిషికేశ్), IIT హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి , AIIMS కళ్యాణికి చెందిన ప్రొఫెసర్ డా. తీర్థంకర్ దేబ్ , AIIMS బీబీనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్ పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా మెడికల్ సూపరింటెండెంట్ డా. మహేశ్వర్ లక్కిరెడ్డి గారు, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీ రాజనీష్ మిశ్రా గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ వి. శశికుమార్ గారు హాజరయ్యారు.

