కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..
ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండాలి..
పెద్దపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభం అయిన నేపధ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి పట్టణ మరియు మండలంలోని బూత్ లెవల్ ఏజెంట్లు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది..
SIR పట్ల ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకులు అందరూ అర్హులైన ప్రతి ఓటరు, ఓటరు జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) ఇంటి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒట్టురి మీ పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచనలు చేశారు.
ప్రజల విశ్వాసాన్ని, తీర్పును గెలుచుకోలేని వారు ఓటర్ల జాబితాల్లో గందరగోళం సృష్టించి, ఓట్లను తొలగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించిన సందర్భాలను ఇటీవల పలు రాష్ట్రాల్లో చూశాము. అలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలకు తెలంగాణలో తావు లేదని ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయసహకారాలు అందించాలని సూచనలు చేశారు.

