Monday, September 21, 2026

Buy now

మైసిగండి తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులు

* బంజారా సోదర సోదరీమణులతో ఆత్మీయంగా మమేకం

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ఘనంగా నిర్వహించిన బంజారా తీజ్ పండుగ వేడుకల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బంజారా సోదర సోదరీమణులతో వారు ఆత్మీయంగా ముచ్చటించారు. తీజ్ పండుగ ప్రాధాన్యతను, బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేడుకల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బంజారా సంఘం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular