Wednesday, June 24, 2026

Buy now

అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ:ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు

పెద్దపల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు పెద్దపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం రోజున నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు శుక్రవారం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆయుష్ శాఖ అధికారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు.

ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు ను యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు.అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ఆదివారం ఉదయం 6:00 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి జిల్లా, నియోజకవర్గ ప్రజలు పాల్గొని యోగ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కోరారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులు డాక్టర్ కేశవ రెడ్డి, అరుణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular