Friday, August 14, 2026

Buy now

అక్రమ కట్టడాలని ఇబ్బంది పెడుతున్న సింగరేణి చర్యలను ఖండించిన టిఎన్టియుసి

* రోడ్డు వెడల్పు పేరిట బాధిత షాపింగ్ లకు పర్మిషన్ ఇస్తున్నారు.. తీరా కట్టుకున్నాక పర్మిషన్ లేదంటూ కూల్చి వేస్తున్నారు.
* ఆగ్రహం వ్యక్తం చేసిన టిఎన్టియుసి నిమ్మకాయల ఏడుకొండలు.

రామగుండం: గోదావరిఖని చౌరస్తా,తిలక్ నగర్,ఎల్. బి నగర్ లో అక్రమ కట్టడాల పేరిట కూల్చి వేయడాన్ని టి ఎన్ టియు సి నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు తీవ్రంగా ఖండించారు.సోమవారం వారు నిరసనలు తెలియజేసి
మాట్లాడుతూ ఇక్కడ ప్రజా పాలన నడుస్తుందా? ప్రజా కంటక పాలన నడుస్తుందా? అర్థం కావడం లేదని ఒకపక్క అభివృద్ధి అంటూ నూతన నిర్మాణాలు లబ్ధిదారులకు న్యాయం అంటూనే మరోపక్క సింగరేణి యాజమాన్యం ఒక మాట,మున్సిపల్ అధికారులు మరొక మాట,ప్రజాప్రతినిధులు మరో విధంగా మాట్లాడుతూ ప్రజలను బాధితులను,లబ్ధి దారులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్న ఈ రాజకీయ క్రీడలు ఆపాలని నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని లేని పక్షంలో టిడిపి,టిఎన్టీయూసీ పక్షాన ఆందోళన తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా క్వార్టర్స్ పక్కన సింగరేణి కార్మికుల పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత రేకుల షెడ్లు నిర్మించుకుంటే అవి కూడా తీయాలని సింగరేణి యాజమాన్యం నోటీసులు ఇవ్వడం సరైన విధానం కాదు తక్షణమే వాటికి కూడా సింగరేణి యాజమాన్యమే పర్మిషన్స్ ఇచ్చి నిర్మించుకునే సదుపాయం కల్పించాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యుసి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కే నిమ్మకాయలు ఏడుకొండలు సింగరేణి కాల రిస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్,టి.మణి రామ్ సింగ్ సింగరేణి కాలరిస్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ,ముదుగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షుడు, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి కోశాధికారి,కొండి శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంట్ టి ఎన్ టి యుసి ప్రచార కార్యదర్శి,కామెర రాజబాబు రామగుండం ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు, సుందిళ్ల స్వామి ఎస్సీ సెల్ కార్పొరేషన్ మాజీ కార్యదర్శి, బిక్కిం వీరేందర్ టిఎన్ఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular