* అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన వారికి ఘన నివాళి
హైదరాబాద్: అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తూ అమరులైన అటవీ శాఖ సిబ్బందికి అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.
అడవులు, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం, నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారు చూపిన మార్గంలో ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అడవులను కాపాడటంతో పాటు వన్యప్రాణులను సంరక్షిస్తూ ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.భావితరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించేందుకు సమష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

