* రూ. 2.40 కోట్లతో పెద్దబొంకూరు హైలెవల్ వంతెన
* రూ. 12 కోట్లతో నిట్టూరు నుంచి కాచాపూర్ వరకు నూతన బీటీ రోడ్డు
* రూ. 40 లక్షలతో పెద్దకలవల శివాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు..
* అభివృద్ధి పథంలో పెద్దపల్లి నియోజకవర్గం
* అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు
* ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి,ప్రతినిధి: మండలంలోని పెద్దబొంకూరు గ్రామంలో రూ.2.40 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ వంతెన మరియు రూ.12 కోట్లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన నిట్టూరు నుండి కాచాపూర్ వరకు నూతన బీటీ రోడ్డు ను స్థానిక నాయకులతో కలిసి గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.
మండలంలోని పెద్దకల్వల గ్రామంలో సిజిఎఫ్ నిధులతో శివాలయంలో రూ.40 లక్షలతో నూతన రాజగోపురం, అర్చకుల వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వ విప్ విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గం గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు నుండి ఓదెల మండలం కొలనూరు మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం అలాగే పెద్దబొంకూరు గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించి రూ. 2.40 కోట్లతో నూతన హై లెవెల్ వంతెన నిర్మించడం జరిగిందని వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందిగా మారకుండా ఉండేందుకు వంతెన నిర్మించడం జరిగిందని అన్నారు.
పెద్దపల్లి మండలం నిట్టూరు నుండి జూలపల్లి మండలం కాచాపూర్ వరకు మండలాలను అనుసంధానం చేస్తూ రూ. 12 కోట్లతో నిర్మించిన నూతన బిటి రోడ్డును సోమవారం ప్రారంభించుకోవడం జరిగిందని, గ్రామాల నుండి మండల కేంద్రాలకు, మండలాల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా నూతనంగా రోడ్లను నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గుర్తు చేశారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా నూతన బస్ డిపో, బైపాస్ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, నూతన పోలీస్ స్టేషన్లు, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధి, అమృత్ పథకం, హై లెవెల్ వంతెనలు, డబల్ లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్లు, అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని గుర్తు చేశారు.
గత పాలకులు పెద్దపల్లి నియోజకవర్గాన్ని కూని చేసినప్పటికీ దళాశవరీగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అభివృద్ధి చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళకు వడ్డీలేని రుణాలు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మరియు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని తెలిపారు.
రానున్న రోజుల్లో నిట్టూరు నుండి వెంకటరావుపల్లి మధ్యలో వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

