సిరిసిల్ల: రబీ 2025-26 సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరా, ఎఫ్‌సీఐ గోదాముల నిల్వ సామర్థ్యంపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ అధికారులు, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రబీ 2025-26 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ సరఫరాలను వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు.
అలాగే జిల్లాలోని రైస్ మిల్లర్లకు అవసరమైన మేరకు ఎఫ్‌సీఐ గోదాముల్లో అదనపు నిల్వ స్థలాన్ని కేటాయించాలని ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్‌కు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

