రామగుండం: రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11 మందిని గోదావరిఖనిలోని సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ ఎదుట హాజరుపరిచారు.
విచారణ అనంతరం 9 మందికి మొత్తం రూ.15,500 జరిమానా విధించగా, ఇద్దరికి జైలు శిక్ష విధించారు. ఆటో డ్రైవరుగా పనిచేస్తున్న ఒకరికి ఒక రోజు, మరో ఆటో డ్రైవరుకు రెండు రోజుల జైలు శిక్ష విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు అవసరమైన పత్రాలు వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే రాంగ్ రూట్‌లో ప్రయాణించకుండా, అతివేగంగా వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

