Friday, September 4, 2026

Buy now

అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌

* అంతర్గాం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అంతర్గాం: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ అంతర్గాం మండల MPDO కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, మౌలిక వసతులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ అధికారులను, ప్రజాప్రతినిధులను సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

మండల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular